సిరాన్యూస్,ఇచ్చోడ
నిందితుడిని ఉరి తీయాలి: రాయిసెంటర్ సలహాదారుడు పెందూర్ తులసీరాం
* ఈనెల 6న ఇచ్చోడ బంద్
ఆసిఫాబాద్ జిల్లా జైనుర్ మండలం దేవుని గూడ గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళపై లైంగిక దాడి హత్యాయత్నం చేసిన నిందితుడిని ఉరితీయాలని రాయిసెంటర్ సలహాదారుడు పెందూర్ తులసీరాం అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని కొమరం భీమ్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాయిసెంటర్ సలహాదారుడు పెందూర్ తులసీరాం మాట్లాడారు. ఆదివాసీ మహిళా పై లైంగిక దాడి, అత్యాయత్నం ఘటనకు నిరసనగా శుక్రవారం ఇచ్చోడ బందుకు పిలుపునిచ్చామని, వ్యాపార, ఇతర దుకాణాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని కోరారు. మహిళకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామన్నారు. నిందితుడిని వెంటనే ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుకు అప్పగించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తొమ్మిది తెగల ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.