మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి
సిరా న్యూస్,బద్వేలు;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో మరో నెల రోజుల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు చెప్పారు.’వైసీపీ హయాంలో ఒక్క కొత్త బస్సు కూడా కొనలేదు. ఉన్న బస్సులనే యథావిధిగా కొనసాగించారు. ఆర్టీసీ మనుగడ కాపాడేందుకు కృషి చేస్తామని, ఆర్టీసీ ఉద్యోగులు, ప్రయాణికులను కాపాడుకునే బాధ్యత మాపై ఉంది’అని ఆయన పేర్కొన్నారు.