ప్రయాణికులపై చిరు వ్యాపారస్తులు దాడి
సిరా న్యూస్,మదనపల్లె;
రైల్ ప్రయాణికులపై చిరు వ్యాపారస్తులు దాడికి దిగారు. 07656 తిరుపతి, గుంతకల్ రైల్లో ఘటన జరిగింది. గొడవ చిన్నపాటి తగాదాతో మొదలైంది. చిరు వ్యాపారస్తులు ఒక్కటై మదనపల్లి స్టేషన్ వద్ద భార్యాభర్తల పై దాడికి దిగారు. అనంతపురం జిల్లా, రాఘవేంద్ర నగర్, కు చెందిన సురేష్ రేణుక భార్యాభర్తలు తిరుపతికి వచ్చి వెళుతుండగా వివాదం మొదలయింది. రైల్వే ప్రయాణికులను చిరు వ్యాపారులు భయబ్రాంతులకు గురిచేసారు