ఇబ్బందుల్లో ప్రయాణికులు.
సిరా న్యూస్,రుద్రవరం;
కూర్చోడానికి సీట్లు లేని పల్లె వెలుగు బస్సుసర్వీస్ లో ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వివరాల్లోకెళితే నంద్యాల ఆర్టీసీ డిపో నుంచి సిరివెళ్లమీదుగా మండల కేంద్రం రుద్రవరం కు బస్సులు నడుపుతున్నారు. ఈ బస్సుల్లో కొంతమేరకు మాత్రమే సీట్లు ఉండడంతో ప్రయాణికులు కూర్చోడానికి లేక అలాగే నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తుంది. రుద్రవరం నుంచి నంద్యాల దాదాపు 45 కిలోమీటర్లు దూరం ఉండడంతో ప్రయాణికులు అంత దూరం నిలబడలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. నంద్యాల ఆర్టీసీ అధికారులు బస్సుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వెంటనే ఆర్టీసీ ఉన్నత అధికారులు చర్యలు తీసుకొని బస్సుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
================