సిరా న్యూస్, కుంధుర్పి
రుషి డిగ్రీ కళాశాలలో గురజాడ అప్పారావు జయంతి
కుంధుర్పిలోని రుషి డిగ్రీ కళాశాలలో శనివారం గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమాన్ని విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా తెలుగు సాహిత్యాన్ని సరళ భాషలో కొత్త పుంతలు తొక్కించిన మహాకవి గురజాడ అని కళాశాల లెక్చరర్స్ అన్నారు . గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు భాషను విద్యార్థులు కనుగుణంగా నవ సమాజ నిర్మాణానికి అనుగుణంగా సరళమైనటువంటి భాషలో తెలుగు భాష ఉండాలని గిడుగు రామ్మూర్తి తో కలిసి గురజాడ అప్పారావు పోరాటం చేశారన్నారు..కన్యాశుల్కం నాటకం, దిద్దుబాటు కథ, దేశమును ప్రేమించుమన్నా గేయం ప్రాచుర్యం పొందాయని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు, లెక్చరర్స్ పాల్గొన్నారు.