సిరా న్యూస్, ఆదిలాబాద్:
రైతులెవరూ ఆందోళన చెందవద్దు…
-కాంగ్రెస్ నాయకులు బాలురి గోవర్ధన్ రెడ్డి
+ విడతలవారీగా అందరికీ రైతుబంధు
+ 34 వేల మంది రైతుల ఖాతాల్లో 24 కోట్లు జమైనట్లు వెల్లడి
విడతల వారీగా అర్హులైన రైతులందరికీ రైతుబంధు నిధులు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయడం జర్గుతుందని, రైతులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు జిల్లాలో 34 వేల మంది రైతుల ఖాతాల్లో రూ. 24 కోట్లు జమైనట్లు వెల్లడించారు. మరో వారం రోజుల్లో మిగిలిన రైతులందరి ఖాతాల్లో నిధులు జమ చేయడం జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతున్నదని వెల్లడించారు.