సిరా న్యూస్,జగిత్యాల;
రైతుబంధుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ కీలక వాఖ్యలు చేశారు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. డిసెంబర్ చివరిలోగా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు వేయనుందని తెలిపారు. కొంతమంది భూస్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వందల ఎకరాల సాగు భూములు చూపుతూ రైతుబంధు పొందుతున్నారని ఆయన ఆరోపించారు. ధరణి లో పేరు ఉండి భూమి లేనివారి గురించి పునరాలోచించి, హామీ ఇచ్చిన విధంగా సాగు చేసే భూములకే ఎకరాకు బి ఆర్ ఎస్ ఇచ్చిన 5000 రూపాయలకు అదనంగా 2500 కలిపి రూ.7500 అందేలా చూస్తామని జీవన్ రెడ్డి వివరించారు..రైస్ మిల్లర్లు బి ఆర్ ఎస్ అధికారంలో ఉన్నపుడు దోచుకున్నారని కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైస్ మిల్లర్లను దోచుకోకుండా అడ్డుకుంటామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు…