Rythu Bharosa: ఇక నిజమైన లబ్ధిదారులకే రైతు భరోసా, రైతు రుణమాఫీ

సిరా న్యూస్,వరంగల్;
పేరుకే పథకాలను పేదల కోసం అంటారు తప్పా.. దాని వెనక లబ్ధిదారులు వేరే ఉంటారు. అలాంటి వాటికి చెక్ పెట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలను అమలు చేయడానికి నిధులు సమకూరుస్తోంది. కేబినెట్ కూడా దానిపై ఓ నిర్ణయం తీసుకుంది. అయితే, నిజమైన లబ్ధిదారులకే రైతుల భరోసా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.అంతేకాదు.. గత ప్రభుత్వం శ్రీమంతులకు, ఫామ్ హౌజ్ ఓనర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారికి కూడా రైతుబంధు ఇచ్చిందని ఆరోపించింది. ఆయన బీఆర్ఎస్‌పై రాజకీయ విమర్శలు చేశారనుకోవడానికి లేదు. నిజంగానే ప్రజాధనం పెద్ద ఎత్తున లూటీ అయిందని లెక్కలు చెబుతున్నాయి. క్రాప్ లోన్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ మహానగరంలో కూడా పెద్ద ఎత్తున వ్యవసాయం చేస్తున్నట్టు చూపిస్తున్నారు.2023–24 ఏడాదిలో హైదరాబాద్ లో బ్యాంకర్లు రూ.1550 కోట్ల పంట రుణాలు ఇచ్చారు. ఇవి బ్యాంకులు చెబుతున్న లెక్కలే. గతే ఏడాడి మేడ్చల్ జిల్లాలో కేవలం 18,199 ఎకరాల భూమిలోనే పంటలు సాగవుతాయి. దానికి రూ. 242 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకులు టార్గెట్ గా పెట్టుకున్నాయి. కానీ.. ఏకంగా రూ.2386.48 కోట్ల రుణాలు మంజూరు అయ్యాయి. అవి కూడా క్రాప్ లోన్సే. అంటే సుమారు 1000 శాతం ఎక్కువగా లోన్లు ఇచ్చారు. అంత మొత్తంలో మేడ్చల్ జిల్లాలో పంటలు పండుతున్నాయా? అనేది చూడాలి. మరో విచిత్రం ఏంటీ అంటే.. క్రాప్ లోన్స్ ముంజూరులో మేడ్చల్ జిల్లా టాప్ ప్లేస్. అంటే.. గ్రామీణ జిల్లాల కంటే ఇక్కడే ఎక్కువగా పంటలు పండుతున్నాయన్నది బ్యాంకర్ల లెక్క.మేడ్చల్ తర్వాతి స్థానంలో రంగారెడ్డి జిల్లా ఉంది. హైదరాబాద్ మహానగరంలో వ్యవసాయ రుణాలు మంజురు చేయడం ఏంటి అని గత ప్రభుత్వ పెద్దలు అడిగింది లేదు. దీని వలన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద రైతులకు అందాల్సిన రుణాలు అందడం లేదు. నిజమైన రైతులకు న్యాయం జరగడం లేదు. రైతు బంధు కూడా ఇలాగే అమలు చేశారనే వాదనలు కూడా ఉన్నాయి.సీఎం రేవంత్ రెడ్డి నిజమైన రైతులకే రైతు భరోసా అందిస్తామని ప్రకటించారు. నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు రియల్ ఎస్టేట్ వ్యాపారలను, భూ స్వాములను తప్పిస్తే పేదలకు మరింత ఎక్కువ సాయం చేయొచ్చు. అదే సమయంలో ప్రభుత్వానికి కూడా భారం తగ్గుతోంది. రైతు భరోసా విషయంలోనే కాదు.. రుణ మాఫీ కూడా ఇలాగే చేయాల్సి ఉంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా రుణమాఫీ విషయంలో కీలక ప్రకటన చేసింది. ట్యాక్సులు కడుతున్న వారు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు రుణమాఫీ ఉండదని ప్రకటించారు. వారితో పాటు వ్యవసాయమే చేయకుండా రుణాలు తీసుకుంటున్న వారిని కూడా గుర్తించి తప్పించాలి. అప్పుడే రైతాంగానికి మరింత మేలు జరుగుతోంది.రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఎలాంటి విధి విధానాలు అమలు చేస్తుందో చూడాలి. 5 ఎకరాలు కంటే ఎక్కువగా ఉన్నవారిని పక్కకు తప్పించే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. అదే జరిగితే ఓ విధంగా మంచిదనే చెప్పాలి. ఇది జరగాలంటే కొన్ని వర్గాల నుంచి ఒత్తిళ్లు రావచ్చు. అయితే, ఆ ఒత్తిళ్లకు తలొగ్గడానికి అక్కడ ఉన్నది కేసీఆర్ కాదని.. రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. నిజంగా రేవంత్ రెడ్డి నిజమైన రైతులను గుర్తించి పథకం అమలు చేస్తే ప్రభుత్వానికి కొంత భారం తగ్గినట్టే.

13 thoughts on “Rythu Bharosa: ఇక నిజమైన లబ్ధిదారులకే రైతు భరోసా, రైతు రుణమాఫీ

  1. Hii I m nazeer velugupally thungathurthy suryapet…….sir andhariki anni esthunaru mari em leni variki em esthunaru

    1. మీ ఆలోచన చాలా కరెక్ట్.. ఏమీ లేని నిరుపేదల గురించి ముందుగా ఆలోచించాలి..

  2. Yes real formers benefits of rythu runamafi and rythu bharosa but political parties in their election manifest should mention all these conditions .please look into the manifest and gothough thoroughly. Each and every political parties should remember elections in every years.

  3. Hon’ble CM, Sir, Pls start instantly the ‘Old Age Pension’ for the people who have completed 58yrs & are helpless, deprived people. I’ve many times pleaded for our basic needs & medicines to buy. I & my Fly., voted for your Govt’ in the Assembly & Lok Sabha polls so that you’ll uplift us from our woes & miseries. Still nothing happened but day by day, our life has become miserable. Pls help us as early as you can. Thanking you, P. Santhosh Kumar Patlur, Bandlaguda Jagir 7013918315

    1. మీ సందేశం సీఎం రేవంత్ రెడ్డి వరకు చేరాలని ఆశిద్దాం..

  4. Many progressive farmers having cultivation in more than 10 acres are discouraged if restrictions are imposed.If government is sincere it should implement minimum support price for all crops and give bonus to rice Rs500 as promised by the chief minister

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *