Sabala- Satyabhama Award:8న సబల- సత్యభామ పురస్కార వేడుక‌

సిరాన్యూస్‌,హైద‌రాబాద్‌
8న సబల- సత్యభామ పురస్కార వేడుక‌
వివిధ రంగాల్లో రాణిస్తున్న స్ఫూర్తిదాయక మహిళలకు సత్కారం     
గోనె వెంకటేశ్వర్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్ర‌తి సంవ‌త్స‌రం సబల- సత్యభామ పురస్కార వేడుకలు నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈనెల 8న మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్బంగా గురువారం మధ్యాహ్నం 3గంట‌ల‌కు సోమాజీగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో సబల- సత్యభామ పురస్కార వేడుక నిర్వ‌హిస్తున్న‌ట్లు జీవీఎస్ఎస్ సేవా సంస్థ నిర్వ‌హ‌కులు గోనె వేంకటేశ్వర్ తెలిపారు. ఈ వేడుకల‌కు హిందూ మహిళలకు ప్రత్యేకమ‌ని తెలిపారు. ఈ పురస్కారానికి ఎంపిక కోసం నామినేషన్ పంపాల‌ని పేర్కొన్నారు. అభ్యర్థులు మీ పేరు, ఊరు, వృత్తి, సాధించిన విజయాలు,అభిరుచులు, అలాగే ఈ పురస్కారం మీకు ఎందుకు ఇవ్వాలో రెండు వాక్యాలు, ఫోన్ నంబర్ తదితర వివరాలను 88860 73169 కు వాట్సాప్ ద్వారా తెలిపారు.  21-39 సంవత్సరాల మ‌ధ్య మ‌హిళ‌లు అర్హులు తెలిపారు. ఎంట్రీలను పరిశీలించి కొందరిని ఎంపిక చేస్తా మ‌ని తెలిపారు. ఎంపిక కాని వారందరూ అనర్హులని కాదు. అందరికీ ఒకేసారి పురస్కారం  ఇవ్వలేం కాబట్టి. ప్రతి సంవత్సరం ఈ పురస్కార వేడుకను నిర్వహించడం మా ఆనవాయితీగా వ‌స్తుంద‌ని తెలిపారు. అవివాహితలు కూడా నామినేషన్ పంపవచ్చ‌ని తెలిపారు. గృహిణి, ఉద్యోగం, వ్యాపారం, స్వయం ఉపాధి, లలిత కళలు, ప్రొఫెషనల్ మ‌హిళ‌లు పాల్గొన‌వ‌చ్చ‌ని తెలిపారు.ఎంపికైన వారికి హైదరాబాద్ లో  పురస్కార ప్రదానం జరుగుతుంది. మీరు సొంత ఖర్చులతో రావాల్సి ఉంటుంద‌ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *