రెండు ప్రాణాలను మింగేసిన ప్రమాదం…
మోతిలాల్ మృతదేహం లభ్యం.
సిరా న్యూస్,ఖమ్మం;
బిడ్డ అశ్వినిని శంషాబాద్ విమానాశ్రయంలో దింపేందుకు తండ్రి మోతిలాల్ ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి శివారు గంగారం తండా నుండి ఆదివాచం తెల్లవారు జామున కారును తానే నడుపుతూ ఆనందంగా బయలుదేరాడు.రిన మోతిలాల్.
కూతురు యువ శాస్త్రవేత్త కుమారి అశ్విని సాయంత్రం శంషాబాద్ నుండి విమానంలో బయలుదేరి ఈరోజు చత్తీస్ గడ్ రాష్ట్రంలోని రాయపూర్ లో జరగనున్న జాతీయ స్థాయి సైన్స్ సెమినార్ లో ప్రసంగించాల్సి ఉంది. మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి పై నుంచి వర్షపు నీరు పోతుండడంతో వరద తీవ్రతతో, మరే కారణమోకానీ.., నిన్న ఉదయం ఆకేరులో వారి కారు పడిపోయింది. తాము వాగులో పడి పోయామని, మెడలోతు నీళ్ళలో ఉన్నామని బోరున విలపిస్తూ సమీప బంధువులకు తండ్రి, కూతురు ఫోన్లు చేసారు. తరువాత కాసేపట్లో ఫోన్లు స్విచ్చాఫ్ అయ్ఆయయి. కారు కనిపించకుండా పోయింది. పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అశ్విని మృతదేహాన్ని, కారును ఆదివారమే బయటకు తీసారు. సోమవారం ఉదయం మోతిలాల్ మృత దేహన్ని గుర్తించారు