సిరా న్యూస్, బేల:
సదల్‌పూర్ జాతరకు తండోపతండాలుగా భక్తులు
+ జనసంద్రంగా మారిన ఆలయం
+ ముగిసిన జాతర
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సదల్‌పూర్ గ్రామంలో వెలిసిన భైరందేవ్ మహాదేవ్ జాతరకు భక్తులు భారీగా తరలివచ్చారు. శుక్రవారం చివరి రోజు కావడంతో భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా కోరంగే వంశీయులు తమ గిరిజన సాంప్రదాయంతో ఆలయంలో ఢోలు వాయిద్యాలు మోగిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల కోసం దహి హండీ కాల నిర్వహించి, ప్రసాద వితరణ గావించారు. అంతకు ముందు రాయ్ సెంటర్ మండల అధ్యక్షులు కోరంగే సోనేరావ్ తన సతీమణి మంజులతో కలిసి దేవతామూర్తులకు అభిషేకాలు గావించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆలయం భక్తజనసంద్రంగా మారింది.