Sai Krishna: జీవితంలో అసాధ్యమైనది ఏదీ లేదు

సిరా న్యూస్, తలమడుగు
జీవితంలో అసాధ్యమైనది ఏదీ లేదు
* మీ సంకల్పమే మిమ్మల్ని విజయతీరాలకు చేరుస్తుంది
* కెరీర్ గార్డెన్స్, మోటివేషనల్ స్పీకర్స్ అల్లం సాయి కృష్ణ, రమణ గౌడ్లు
మీ సంకల్పమే మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తుందని కెరీర్ గార్డెన్స్, మోటివేషనల్ స్పీకర్స్ అల్లం సాయి కృష్ణ, రమణ గౌడ్లు అన్నారు. తలమడుగు మండలం ఖోడద్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు గురువారం ప‌లు విష‌యాల‌ను తెలియ‌జేశారు.విద్యార్థులు పరీక్ష భయాన్ని వీడి ఉన్న సమయాన్ని ప్రణాళిక బద్ధంగా వాడుకొని చదివితే తప్పకుండా మంచి మార్కులతో ఉత్తీర్ణులు కాగులుగుతారని చెప్పారు. భవిష్యత్తులో తాము ఏమి కావాలో నిర్దేశించుకుని దానికి సంబంధించిన కోర్సులను చదివితే తక్కువ సమయంలోనే తమ లక్ష్యాలను చేరుకోగలుగుతారని అన్నారు. పాఠశాలలో చదివే పదవ తరగతి విద్యార్థులతో పాటు మిగతా విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పే ప్రతి విషయాన్ని శ్రద్ధగా చదివి పరీక్షలు రాయాలని సూచించారు. జీవితంలో అసాధ్యమైనది ఏదీ లేదని మీరు తలుచుకుంటే దేన్నైనా సాధించుకోగలుగుతారని అనేక ఉదాహరణలతో, పిట్టకథలతో విద్యార్థులను ఆకర్షించే విధంగా వివరించి చెప్పారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కృష్ణకుమారి ఉపాధ్యాయులు ఏ. లక్ష్మి, సుకుమార్ పేట్కులే, డి. సురేఖ, ఎస్. సురేఖ, సత్యనారాయణ, వాసుదేవ్, పి ఈ టి మమత, కిరణ్ కుమార్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *