సిరాన్యూస్, సైదాపూర్:
సైదాపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి పాలాభిషేకం
సైదాపూర్ మండల కేంద్రంలో శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంత సుధాకర్, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుండారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులందరికీ గడువులోగా ఏకకాలంలో 2లక్షల వరకు రుణమాఫీ చేయాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కి కాంగ్రెస్ నాయకులు, రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మేకల రవీందర్, కిష్టయ్య, రాఘవులు,రాజిరెడ్డి, మల్లయ్య,విద్వాన్ రెడ్డి, ఎర్రాల శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షులు గొల్లపల్లి యాదగిరి,వెల్ది రాజు, భాష వేణి సంపత్, అశోక్,వెంకటేశం, మునిపాల రవి,కొమురయ్య, ఈశ్వరయ్య, మేకల రాజు, యువజన కాంగ్రెస్ నాయకులు తిరుపతి నాయక్, అనిల్, సందీప్, కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.