సిరాన్యూస్, ఆదిలాబాద్
సీఆర్ఆర్ నివాసంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను బుధవారం అదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని మాజీమంత్రి సిఆర్ఆర్ నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ సంజీవరెడ్డి, నాయకుల లక్ష్మారెడ్డి, ముర్రుజా భాయ్, మునీర్ భాయ్, శకీర్ భాయ్, అఖ్తర్ భాయ్, మధుకర్ భాయ్, ఇమ్రాన్ భాయ్, ఎం బి టి మహమూద్ భాయ్, రిజ్వాన్ భాయ్ , రాహుల్ గాంధీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.