సిరా న్యూస్, నిర్మల్:
స్టాఫ్ నర్స్ ఫలితాల్లో సత్తా చాటిన సల్ల కృష్ణ కుమారి
+ రాష్ట్ర స్థాయిలో 394 ర్యాంక్
+ జోన్ స్థాయిలో 15వ ర్యాంక్‌తో ఉద్యోగం స్వంతం
నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రానికి చెందిన సల్ల కృష్ణ కుమారి ఆదివారం విడుదలైన స్టాఫ్ నర్స్ ఫలితాల్లో సత్తా చాటారు. రాష్ట్ర స్థాయిలో ఏకంగా 394 ర్యాంక్ సాధించి స్పూర్తిగా నిలిచారు. జోన్ స్థాయిలో 15వ ర్యాంక్ రావడంతో ఆమె ఉద్యోగం స్వంతం చేసుకున్నారు. ప్రçస్తుతం ఆదిలాబాద్ రిమ్స్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపాదికన నర్స్‌గా విధులు నిర్వహిస్తున్న ఆమె 2023 ఆగస్ట్‌లో మెడికల్ బోర్డ్ నిర్వహించిన స్టాఫ్ నర్స్ పరీక్షకు హాజరయ్యారు. భర్త, పిల్లలు, కాంట్రాక్ట్ ఉద్యోగం చేసుకుంటూనే అమే పరీక్షలకు సిద్ధమయ్యారు. భర్త, ప్రముఖ్య న్యాయవాది సల్ల ప్రశాంత్ రెడ్డి ప్రొద్బలంతో ఈ పరీక్షల కోసం ఇంటి వద్ద నుంచే ప్రిపెరేషన్ ప్రారంభించారు. తొలి ప్రయత్నంలో ఉద్యోగం స్వంతం చేసుకొని, సాధించాలనే పట్టుదల ఉంటే ఎదైనా సాధ్యమే అని నిరూపించారు. ఒక వైపు కుటుంబ బాధ్యతలు, మరో వైపు ఉద్యోగ బాధ్యతలు మోస్తూనే స్టాఫ్ నర్స్‌గా ప్రభుత్వ ఉద్యోగం సాధించి అందరిచేత శెభాష్ అనిపించుకున్నారు. అయితే తన భర్త సల్ల ప్రశాంత్ రెడ్డి సహాకారంతోనే ప్రభుత్వం ఉద్యోగం అనే కల సాకారం అయ్యిందని, ఈ విజయం తన భర్తకే అంకితమని ఆమె చెబుతున్నారు.