సిరాన్యూస్, బోథ్
మండల అభివృద్ధికి సహాయసహకారాలు అందిస్తాం
* కాంగ్రెస్ పార్టీ నాయకులు సల్ల రవి
* కాంగ్రెస్ ఆధ్వర్యంలో నూతన ఎంపీడీఓకు ఘన సన్మానం
మండల అభివృద్ధి సహాయసహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు సల్ల రవి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలానికి నూతన ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన రమేశ్‌ను శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు సల్ల రవి, మల్లెపూల సత్యనారాయణలు శాలువా కప్పి సన్మానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ నాయకులు బూరుగుల మల్లేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు సల్ల రవి, బీసీ సేల్ నాయకులు జుంగల బోజన్న, గంగారెడ్డి ,చిన్న బాపు,లోలపుపోశెట్టి , కాంగ్రేస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.