సిరాన్యూస్, బేల
కార గ్రామంలో రేషన్ షాప్ ఏర్పాటు: యువజన కాంగ్రెస్ నాయకుడు సామ రూపేష్ రెడ్డి
తీరిన కార,వంజరిగూడ,గరకగూడ గ్రామస్తుల కష్టాలు
* అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన సామ రూపేష్ రెడ్డి
ఎట్టకేలకు యువజన కాంగ్రెస్ నాయకుల పోరాట ఫలితంగా ఆదిలాబాద్ జిల్లాలోని బేల మండలంలో గల కార, వంజరిగూడ, గరకగూడ గ్రామ ప్రజలకు రేషన్ కష్టాలు బుధవారంతో దూరమయ్యాయి. ఎన్నో ఏళ్లుగా వారి గ్రామం నుంచి 16 కిలోమీటర్ల దూరం ఉన్న తోయిగూడ గ్రామానికి వెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకునే పరిస్థితిని చూసి పలువురు ప్రజలు యువజన కాంగ్రెస్ నాయకుడు సామ రూపేష్ రెడ్డి సృష్టికి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు తీసుకువచ్చారు.దీనిపై వెంటనే స్పందించిన సామ రుపేష్ రెడ్డి అక్కడి అమాయక ప్రజల కష్టాలను దూరం చేసేందుకు ముందుకు వచ్చారు.దీంతో అధికారులు ఆర్డిఓ ఎమ్మార్వో ల దృష్టికి తీసుకువెళ్లి కార గ్రామంలో రేషన్ షాపు ఏర్పాటు చేసి స్థానికంగానే సరుకులు పంపిణీ చేసి అక్కడి ప్రజల దూర భారాల కష్టాలను తీర్చాలని విజ్ఞప్తి చేశారు.గడిచిన బి.ఆర్.ఎస్.పదేళ్ల ప్రభుత్వంలో పరిష్కారం కానీ రేషన్ సమస్యను సామ రూపేష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో తీర్చారు.ఈ మేరకు రేషన్ షాపును కార గ్రామంలోని ఏర్పాటు చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ సామ రూపేష్ రెడ్డికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది ఇలా ఉంటే తాను అధికారుల దృష్టికి తీసుకు వెళ్లిన సమస్యను అన్ని విధాలుగా పరిశీలించి పరిష్కరించినందుకు ఆదిలాబాద్ ఆర్డిఓ తో పాటు సంబంధిత ఎమ్మార్వో తదితర అధికారులకు సామ రుపేష్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.అయితే బేల మండలంలోని ఆదివాసి గ్రామాలతో పాటు స్థానికంగా ఉన్న ప్రజలు ఏవైనా దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు తాను అందుబాటులో ఉంటానని,ఆ సమస్యలను తెలంగాణ రాష్ట్ర జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కతో పాటు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు అన్ని విధాలుగా సహకరిస్తానని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.