సిరా న్యూస్, బేల:
మాజీ ఎంపీపీని పరామర్శించిన రూపేష్ రెడ్డి…
ఆదిలాబాద్ జిల్లా బేల మండల మాజీ ఎంపీపీ బాపూరావ్ ఉల్కేను యువజన కాంగ్రేస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి పరామర్శించారు. గత కొన్ని రోజులుగా బాపూరావ్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెల్సుకున్న రూపేష్ రెడ్డి కాంగ్రేస్ నాయకులతో కలిసి బేల మండలంలోని దహేగావ్కు వెళ్లి ఆయన్ను కలిసారు. ఈ సందర్భంగా బాపూరావ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెల్సుకున్నారు. ఆయన వెంట మాజీ జడ్పిటీసీ రాందాస్ నాక్లే, నాయకులు ఘన్శ్యామ్, విపిన్ ఠాక్రే, గంభీర్, సూర్యబాన్, ఈశ్వర్, తదితరులు ఉన్నారు.