సిరా న్యూస్,బేల
గ్రామంలో విద్యుత్ స్తంభాలు వేయాలి : యువజన కాంగ్రెస్ కార్యకర్త సామ రూపేష్ రెడ్డి
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని పిట్ గావ్ గ్రామంలో ఉన్న విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని యువజన కాంగ్రెస్ కార్యకర్త సామ రూపేష్ రెడ్డి సంబంధిత మండల విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. గ్రామంలో ప్రధానంగా రోడ్డు వెంట విద్యుత్ స్తంభాలు వేసి ఉన్న అవి గృహ అవసరాలకు తీసుకోవడానికి వీలుగా లేకపోవడం తో వేల రూపాయలు పెట్టి సర్వీస్ వైర్ కొనుగోలు చేసి కరెంటు తీసుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలో అధికంగా లోడ్ పడి ఫ్రిజ్లు,టీవీలు, ఫ్యాన్లు, కూలర్లు, కాలిపోయి బల్బులు ఎగిరిపోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. ఇలాంటి పరిస్థితులు దృష్ట్యా గ్రామస్తుల కోరిక మేరకు సంబంధిత విద్యుత్ శాఖ ఏఈ సంతోష్ ను గ్రామానికి తీసుకువెళ్లి అక్కడున్న పరిస్థితిని చూపించారు. దీనిపై స్పందించిన విద్యుత్ శాఖ మండల ఏఈ సంతోష్ అందుకు తాగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. త్వరలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసేందుకు గ్రామస్తులు కూడ సహకరించాలని కోరారు. అడిగిన వెంటనే పరిశీలించేందుకు వచ్చి సమస్యను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చిన అధికారులకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ బాపురావు,యువజన కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు బాపూరావు, గ్రామస్తులు విలాస్ రాథోడ్, దేవిదాస్ రాథోడ్,ఆదిత్య సాయబ్రావు, తదితరులు ఉన్నారు.