సిరా న్యూస్, ఆదిలాబాద్:
మంత్రి సీతక్కను కలిసిన సగ్రమ శిక్షా ఉద్యోగులు
+ తమను రెగులరైజ్ చేయాలని వినతి
తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్షా ఉద్యోగులు పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదిలాబాద్ పట్టణంలోని జడ్పీ సమావేశ మందిరంలో మంత్రిని కలిసి, తమను రెగ్యులరైజ్ చేయాలని వినతిపత్రం అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 18600 మంది సమగ్ర శిక్షాలో పనిచేస్తున్నట్లు వారు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమను రెగ్యులరైజ్ చేసి, తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్ మాధవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామెల్లి ప్రకాష్, నాయకులు దేవదర్శన్, పార్థసారథి, నాగ్‌నాథ్, చిరంజీవి, గణేష్, రాజేశ్వర్, జావేద్, తదితరులు ఉన్నారు.