సిరాన్యూస్, సామర్లకోట
సామర్లకోటలో ఉత్తమ ఉద్యోగి గ్రహీతలకు ఘనంగా సన్మానం
స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని గురువారం సామర్లకోట మండలంలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నడి. చంద్రశేఖర్, ఆఫీసు సబార్డినేట్ వై.అప్పారావులు ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వారి చేతులు మీదుగా ఉత్తమ ఉద్యోగుల అవార్డు అందుకున్నారు. ఈసందర్బంగా శనివారం ఉత్తమ ఉద్యోగి గ్రహీతలు చంద్రశేఖర్, వై. అప్పారావులను సామర్లకోట ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఎంపీడీఓ లలిత మాట్లాడుతూ తన కార్యాలయ సిబ్బంది లో ముగ్గురు ఉప ముఖ్యమంత్రి చేతుల మీద అవార్డు తీసుకోవడం చాలా ఆనందం గా ఉందన్నారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.