సిరాన్యూస్, ఓదెల
ఘనంగా డైరెక్టర్ సంపత్ నంది పుట్టినరోజు వేడుకలు
పెద్దపల్లి జిల్లా ఓదెల గురువారం మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ వద్ద సినీ డైరెక్టర్ సంపత్ నంది పుట్టినరోజు వేడుకలు సంపత్ ఫ్యాన్స్ మిత్రులు ఘనంగా నిర్వహించారు. ఆయుధం సినిమాతో తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయమై అనాది కాలంలో చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంపత్ నంది ఏమైంది ఈ వేళ రచ్చ బెంగాల్ టైగర్ గౌతమ్ నంద వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన సంపత్ నంది జన్మదిన వేడుకలు ఓదెలలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఓదెల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి మాట్లాడుతూ చలనచిత్ర రంగంలో మా తోటి మిత్రుడు సంపత్ నంది ఇంకా ఎన్నో సూపర్ డూపర్ చిత్రాలను నిర్మించాలని.,ఓదెల గ్రామానికి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ఆయన అన్నారు . కార్యక్రమంలో గడిగొప్పుల సంతోష్, డాక్టర్ సతీష్, క్యాతం రాజేంద్రప్రసాద్, డాక్టర్ మెరుగు భీష్మ చారినేత, డాక్టర్ ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు, ఆర్ లక్ష్మణ్ , బి సమ్మయ్య, శ్రీమంతుల విక్కీ రాకేష్, తిరుపతి, జంగ మధు, తదితరులు పాల్గొన్నారు.