సిరాన్యూస్, గుడిహత్నూర్
ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఏపీఓ సామ్యూల్
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో వివిధ గ్రామాలలో ఉపాధి హామీ పనులను బుధవారం ఎపిఓ సామ్యూల్ పరిశీలించారు. అనంతరం డోoగర్గావ్ గ్రామ ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ ఉదయం 7 గంటలనుండి 10 గంటల వరకు పనులు చేయాలని, ఎండలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొలత ప్రకారం పని చేస్తే రోజుకి 300 రూపాయలు కూలి వస్తందని చెప్పారు.తర్వాత కూలీలకు ఓ ఆర్ ఎస్ పాకెట్లను పంచారు. ఏ పిఓతో పాటు టి ఎ సంజీవ్, ఎఫ్ఏ రాథోడ్ తుకారామ్ పాల్గొన్నారు.