Sand tractor:ఇసుక ట్రాక్ట‌ర్ ప‌ట్టివేత‌

సిరా న్యూస్, ఖానాపూర్ 
* ఇసుక ట్రాక్ట‌ర్ ప‌ట్టివేత‌
అక్ర‌మంగా ఇసుక త‌ర‌లిస్తున్న ట్రాక్ట‌ర్‌ను పోలీసులు ప‌ట్ట‌కున్నారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి.  నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఆదివారం రాత్రి ఖానాపూర్ శివారులో  అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు.  ఎలాంటి అనుమతి పత్రాలు,  పర్మిషన్ లేకపోవ‌డంతో  ఇసుక  ట్రాక్టర్ ను పట్టుకోగా ట్రాక్టర్ డ్రైవర్ పారిపోయారు. అనంత‌రం ఆ ఇసుక ట్రాక్టర్ ను ఖానాపూర్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. అనంత‌రం తహసిల్దార్ ఖానాపూర్ కు అప్పగించిన‌ట్లు ఖానాపూర్ ఎస్సై జి. లింబాద్రి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *