సిరాన్యూస్,బేల
ప్రయాణికులకు సౌకర్యార్థం చలివేంద్రం
* పంచాయతీ ప్రత్యేక అధికారి సంధ్యారాణి
అదిలాబాద్ జిల్లా బేల మండలం సిర్సన్న పంచాయతీ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద సోమవారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
పంచాయతీ ప్రత్యేక అధికారి సంధ్యారాణి దీన్ని ప్రారంభించారు. వేసవి నేపథ్యంలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు దీన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సురేష్ గ్రామస్తులు పాల్గొన్నారు.