సిరా న్యూస్, ఆదిలాబాద్:
సాటి మనిషికి సేవ చేయడానికే సంగెం ట్రస్ట్…
సమాజంలో నిస్సహాయులు, నిరుపేదలైన సాటి మనుషులకు సేవ చేయడమే లక్ష్యంగా సంగెం చారిటబుల్ ట్రస్ట్ పనిచేస్తోందని ట్రస్ట్ అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది సంగెం సుధీర్ కుమార్ అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణ కేంద్రంలో ఈ మేరకు ట్రస్ట్ సభ్యులతో కలిసి అన్నదానం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు సూపరింటెండెంట్ కౌటికే సంజయ్ హాజరై నిరుపేదలకు అన్నదానం చేసారు. అనతరం ఆయన మాట్లాడుతూ… 149 వారాలుగా అన్నదానం నిర్వహిస్తున్న ట్రస్ట్ సేవలను కొనియాడారు. ఇలానే మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. అనంతరం ట్రస్ట్ సభ్యులు ఆయన్ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మహేందర్ రెడ్డి, సలీమ్, సుభాష్, రాజయ్య, అంబయ్య, గణేష్, తదితరులు పాల్గొన్నారు.