సిరా న్యూస్, ఆదిలాబాద్:
లచ్చి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సంగెం సుధీర్
సంగెం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు, ప్రముఖ్య న్యాయవాది సంగెం సుధీర్ కుమార్, డిప్యూటీ కలెక్టర్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి లచ్చి రెడ్డి, తహాసీల్దార్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాములును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆదిలాబాద్ పట్టణ కేంద్రంలోని స్థానిక విద్యుత్ తరంగిణి ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసిన వారిని సంగెం సుధీర్ కలిసి బొకేలు అందజేసారు. అనంతరం ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలను వివరించారు. కాగా ట్రస్ట్‌కు తమ సహాకారం ఎప్పుడూ ఉంటుందని వారు అన్నారు. ఆయన వెంట ట్రస్ట్ సభ్యులు మహేందర్ రెడ్డి, సలీమ్, సుభాష్, రాజయ్య, అంబయ్య, రెవెన్యూ ఉద్యోగులు ఎస్తేర్ వర్ణ, రమేష్ రాథోడ్, రాజేశ్వర్, రాంరెడ్డి, అత్తర్, సందేశ్, తదితరులు ఉన్నారు.