సిరా న్యూస్, ఆదిలాబాద్:
మాజీ మంత్రి గొడం నగేష్‌ను కలిసిన సంగెం ట్రస్ట్ సభ్యులు
సంగెం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, మాజీ మంత్రి గొడం నగేష్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆదివారం ఈ మేరకు ట్రస్ట్ అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది సంగెం సుధీర్ కుమార్ మాజీ మంత్రిని శాలువా, పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలను ఆయనకు విన్నవించారు. అనంతరం గొడం నగేష్ మాట్లాడుతూ.. ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు తమ వంతుగా సహాయసాకారాలు అందిస్తామని అన్నారు. రానున్న రోజులో ఇదే స్పూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాక్షించారు. ఆయన వెంట ట్రస్ట్ సభ్యులు మహేందర్ రెడ్డి, సలీమ్, అంబయ్య, తదితరులు ఉన్నారు.