సిరాన్యూస్, బోథ్
రైతు భరోసా నిధులు విడుదల చేయాలి: జిల్లా అధ్యక్షులు సంగెపు బొర్రన్న
ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే రైతులకు రైతు భరోసా నిధులను విడుదల చేసే ఆదుకోవాలని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంగెపు బోర్రన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆదిలాబాద్ బోథ్ మండల మండల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. రైతుబంధు సన్నిధిలో విడుదల కాకపోవడంతో రైతులు వడ్డీ వ్యాపారం ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. బ్యాంకులలో పంట రుణాలు తక్షణమే అందించే విధంగా ప్రభుత్వం జోక్యం కల్పించు కోవాలన్నారు. సమావేశంలో రైతులు మారుతి, అంబాజీ, భూమన్న, సుంకన్న, నారాయణ తదితరులు ఉన్నారు