సిరాన్యూస్, బేల
సాంగిడి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడి గ్రామానికి చెందిన 2004-2005 ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న 10 వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఎంతగానో ఆకట్టుకుంది.ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తిరుమల క్లాసిక్ గార్డెన్ లో నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.ఈ సందర్భంగా ఒకరినొకరు తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.ప్రస్తుతం ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు.ప్రతి ఒక్కరు తమ తోటి స్నేహితుల కష్టసుఖాల్లో పాలుపంచుకొని చేదోడు వాదోడుగా తమ వంతు సహాయ సహకారాలను అందించాలని ప్రతిజ్ఞ చేశారు.ఇందులో భాగంగా ఆర్థికంగా వెనకబడి ఉన్న తమ తోటి మిత్రులను ఆపద సమయంలో ఆదుకునేందుకు జమచేసి ఆపద వచ్చినప్పుడు ఇచ్చేందుకు నిర్ణయించు కున్నారు. భవిష్యత్తులో ఏది ఏమైనా తమ పదవ తరగతి విద్యార్థులు అందరూ ఒకరినొకరు తమ కష్టసుఖాలను తోటి మిత్రులతో పంచుకోవాలని తోచిన సహాయాన్ని అందించి కష్టాల్లో ఉన్న తమ స్నేహితునికి అండగా నిలవాలని తెలియజేశారు. కార్యక్రమంలో సామ రూపేష్ రెడ్డి,నగేష్,జైపాల్,నవనీత్ రెడ్డి, అరుణ్,అమరేందర్ రెడ్డి,దీపక్,అనిల్,గణేష్,కవిత,శరణ్య,శాలిని రెడ్డి,లలిత,మనిషా,అర్చన,తదితరులు ఉన్నారు.