సిరా న్యూస్, బేల:
సాంగిడిలో ఘనంగా శోభాయాత్ర…
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడి గ్రామంలో గ్రామ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు. సోమవారం ఈ మేరకు గ్రామంలోని ఆంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. సీతా సమేతుడైన రాములోరికి నూతన వస్త్రాలను అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు గావించారు. అయోధ్య రామాలయంలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా, గ్రామమంతా సందడి నెలకొంది. శ్రీ రామ నామ స్మరణతో గ్రామం మార్మోగింది. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని, రాములోరిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.