సిరాన్యూస్, బేల
వన్ టౌన్ ఎస్సై సిద్రప్ అశోక్‌ను కలిసిన సాంగిడి గ్రామస్తులు
ఆదిలాబాద్ వన్ టౌన్ కు బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్సై సిద్రప్ అశోక్ ను ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆయనకు జిల్లా ఎస్పీతో ఉన్న ఫోటో అందించి శాలువాతో సత్కరించి అభినందించారు.ఈ సందర్భంగా వన్ టౌన్ ఎస్సై సిద్రప్ అశోక్ పోలీసులకు యువత సహకారం ఎంతో అవసరమని,వారు పోలీసులకు అవినాభావ సంబంధంతో ఉంటూ ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకారం అందించాలని ఆయన యువకులను కోరారు. ఈ కార్యక్రమంలో కుంట రఘుకుల్ రెడ్డి, సామ రూపేష్ రెడ్డి, కైపెళ్లి జైపాల్,బరే స్వామి,సిద్రప్ సునీల్, అమరేందర్ రెడ్డి, చెన్న శ్రీకాంత్, గణేష్, మేకల జితేందర, కైపెల్లి గంగన్న, సతీష్, దాసరి సంజీవ్,తదితరులు పాల్గొన్నారు.