సిరా న్యూస్,సంగారెడ్డి;
బొల్లారం మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న సమయంలో పారిశుద్ధ కార్మికుడు సరసింహ డ్రైనేజిలో పడి మృతిచెందాడు. మృతుని కుటుంబానికి న్యాయం చెయ్యాలంటూ బొల్లారం మున్సిపల్ కార్యాలయం ముందు పారిశుద్ధ కార్మికులతో బీజేపీ నాయకుడు ఆనంద్ కృష్ణారెడ్డి ధర్నాచేస్తున్నారు. 150 మంది కార్మికులు చేయ్యాల్సిన పనిని,50 మంది కార్మికులతో పనిచేయిస్తున్నారంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు