సిరాన్యూస్,ఓదెల
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనవు కలెక్టర్ వేణు
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానాన్నిపెద్దపల్లి జిల్లా అదనవు కలెక్టర్ వేణు సందర్శించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్బంగా ఆలయ ఈవో అదనపు కలెక్టర్ కి స్వామివారి ప్రతిమను అందించారు. అలాగే వరి ధాన్యం కొనుగోళ్లు సొసైటీ, ఐకెపి కేంద్రాలను పెద్దపెల్లి జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. 41 కేజీ ల కంటే ఎక్కువ ధాన్యం తూకం చేయొద్దు అని సూచించారు. గన్నీ సంచులు లారీలు సమన్వయం చేసుకుంటూ రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. వారి వెంట ఓదెల తహసీల్దార్ బి.యా కన్నా, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమేష్, మండల వ్యవసాయ అధికారి బి భాస్కర్, ఏపీఎం లతా మంగేష్కర్, తదితరులు ఉన్నారు.