సిరా న్యూస్,శ్రీకాకుళం;
శ్రీకాకుళం జిల్లా పలాస లోని ప్రభుత్వ పాఠశాలల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కాశీబుగ్గ సాయి కాలనీలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ప్రాంగణాన్ని శోభాయమానంగా అలంకరించారు. విద్యార్థినులు వేసిన ముత్యాల ముగ్గులు , రంగ వల్లిలు చూపరులను కనువిందు చేశాయి. పాఠ్యాంశాలను బోధించే ఉపాధ్యాయులు తెలుగు సంస్కృతి ఉట్టి పడేలా సంప్రదాయ దుస్తులు ధరించి విద్యార్థులతో కలిసి ఆట పాటలతో సందడి చేశారు.విద్యార్థులు, ఉపాధ్యాయులు కేరింతల నడుమ బోగి మంటలు వేసి కన్నుల పండుగగా ముందస్తు సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు.