ప్రతిభ చూపిన విజేతలకు బహుమతులు ప్రధానం
సిరా న్యూస్,నెల్లూరు;
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 23వ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ పడారుపల్లి గ్రామంలో స్థానిక వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ (ఒరిస్సా) శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా వివిధ క్రీడ అంశాలలో పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ మేరకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, రూరల్ ఇన్చార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి సూచనల మేరకు నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, నగర మేయర్ పోట్లూరు స్రవంతి జయవర్ధన్ లు వివిధ పోటీల్లో పాల్గొని విజేతులైన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. మంగళవారం సాయంత్రం పడారుపల్లి గ్రామంలో స్థానిక కార్పోరేటర్ ఒరిస్సా శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో క్రీడాకారులకు బహుమతి ప్రధానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లస్టర్ 2 అధ్యక్షులు పాతపాటి పుల్లారెడ్డి, 22వ డివిజన్ కార్పొరేటర్ మూలే విజయభాస్కర్ రెడ్డి, యనమల మల్లికార్జున్రెడ్డి, కేశవులు, శివకుమార్, మండల జెసిఎస్ కన్వీనర్ మొయిల్లా సురేష్ రెడ్డి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు అలగర ప్రభాకర్, వేలూరు శ్రీధర్ రెడ్డి, పొట్లూరి జయవర్ధన్ స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.