Santhosh Janve: కుల వృత్తులను కాపాడాలి

సిరా న్యూస్, బేల‌
కుల వృత్తులను కాపాడాలి
* విశ్వకర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు సంతోష్ జాన్వె
* ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు
జిల్లాలోని అన్ని పార్టీల నాయకులు తమ జీవన ఉపాధికి సబ్సిడి రూపంలో లోన్ ఇప్పించి తమ కుల వృత్తులను కాపాడాలని విశ్వకర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు సంతోష్ జాన్వె అన్నారు.  ప్రపంచ సృష్టి కర్త విశ్వకర్మ జయంతి వేడుకలను బేల మండలంలో వడ్రంగి కులస్థులు ఘనంగా నిర్వహించారు.మండల కేంద్రంలో గల సంఘభవనంలో విశ్వకర్మ జెండాను ఆవిష్కరించి ఆయన చిత్ర పటానికి ఘన నివళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల వివిధ పార్టీలకు చెందిన నాయకులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా విశ్వకర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు సంతోష్ జాన్వె మాట్లాడుతూ తమ కులంలో నైపుణ్యం కలిగిన యువకులకు జీవనోపాధి లేక చాలా ఇబ్బందులూ పడుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక కులస్థులకు జీవనోపాధి చూపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మాపట్ల ఆలోచించాలని అన్నారు. ఈ ఆధునిక కాలంలో టెక్నాలజీ ద్వారా ముందుకు వెళ్తున్న సమయంలో మా యొక్క కులవృత్తులు జీవనోపాధి కొరకు అల్లాడుతున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బేల మండల వివిధ రాజకీయ పార్టీల నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *