సిరా న్యూస్ , భీమదేవరపల్లి
మూసివేసిన పాఠశాలను ప్రారంభించండి
* ప్రయాణికుల కోసం బస్ సౌకర్యం ఏర్పాటు చేయండి
* బీజేపీ పార్టీ బూత్ నాయకులు గుగులోతు సంతోష్
భీమదేవరపల్లి మండలం వీరులగడ్డ తండా లోని గత కొన్ని సంవత్సరాల నుండి మూసివేసిన పాఠశాలను తిరిగి ప్రారంభించాలని, తండాకి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలి వీరులగడ్డ తండా బీజేపీ పార్టీ బూత్ నాయకులు గుగులోతు సంతోష్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ తండాలో దాదాపుగా 200 ఇల్లులు ఉన్నాయని, చిన్నారుల కోసం మూసివేసిన పాఠశాలను మళ్ళీ ప్రారంభించాలని, చదువులకోసం దాదాపు 3 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందని, ఎండ కాలం పిల్లలు బడికి వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారని, ఉన్నత అధికారులతో చర్చలు జరిపి, పాఠశాలను తిరిగి ప్రారంభించాలని కోరారు.