Santosh:రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధా లుగా ఆదుకోవాలి

సిరాన్యూస్‌, ఓదెల
రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధా లుగా ఆదుకోవాలి
ఓదెల గ్రామ విశ్వబ్రాహ్మణ మాజీ అధ్యక్షులు నాగవెళ్లి సంతోష్
రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధా లుగా ఆదుకోవాలని ఓదెల గ్రామ విశ్వబ్రాహ్మణ మాజీ అధ్యక్షులు నాగవెళ్లి సంతోష్ అన్నారు. బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో మాజీ అధ్యక్షులు నాగవెళ్లి సంతోష్, ప్రధాన కార్యదర్శి నాగుల మల్యాల లక్ష్మణాచారి మాట్లాడారు. ఓదెల మండలంలోని కులవృత్తి చేసుకునే విశ్వబ్రాహ్మణులు 450 కుటుంబాలకు పైగా కులవృత్తిపైనే జీవిస్తున్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ప్రతి రాజకీయ నాయకుడు చెప్పే వాగ్దానాలు మీ కులానికి ఇది చేస్తాం అది చేస్తాం. ఇది అందజేస్తామని తప్ప 75 ఏళ్లుగా కులవృత్తి చేసుకునే మాకు ఎలాంటి కార్పొరేషన్ లేక ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నాము కాగా కార్పొరేషన్ వ్యవస్థలో రెడీమేడ్ వస్తువులు మార్కెట్లో చౌకగా దొరికే ఫర్నిచర్లతో విశ్వబ్రాహ్మణులకు చేతినిండా పని లేక ఉప్పరి పనిలో తట్టబట్టినారు. శిల్పి విశ్వజ్ఞ బ్రాహ్మణులకు సెప్టెంబర్ 17న దేశవ్యాప్తంగా విశ్వకర్మ జయంతి అంగరంగ వైభవంగా జరుపుతుంటారు. దేశ ప్రధాని కులవృత్తి చేసుకునే విశ్వబ్రాహ్మణులకు ఆనాటి కాలంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉండేవి నేడు ఆ ఆధునిక యుగంలో ట్రాక్టర్ తో పనులన్నీ చేయించుకుంటున్నారు రైతులు. ఆ సాములంతా కూసునేటి వడ్రంగుల వాకిళ్లు నేడు పొక్కిలితో దుఃఖిస్తున్నాయి. బ్రహ్మంగారి వారసులు కాలానికే కాలజ్ఞానం నేర్పిన విశ్వబ్రాహ్మణులు కటిక పేదరికంలో మగ్గుతున్నారు తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన విశ్వబ్రాహ్మణులు. గత ప్రభుత్వం ఏ ఒక్క విశ్వబ్రాహ్మణున్ని ఆర్థికంగా ఆదుకోలేదు. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధా లుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *