Santosh: జాతీయ స్థాయి లాక్రోస్ క్రీడల్లో స‌త్తా చాటిన‌ సంతోష్

సిరాన్యూస్‌, కుందుర్పి
జాతీయ స్థాయి లాక్రోస్ క్రీడల్లో స‌త్తా చాటిన‌ సంతోష్
అభినందించిన‌ ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్

అన్నిరంగంలో క్రీడాకారులు రాణించాలని ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ తరపున ఆగ్రాలో జరిగిన జాతీయ స్థాయిలో జరిగిన లాక్రోస్ క్రీడాల్లో శ్రీరాంగాపురానికి చెందిన సంతోష్ ఎంపికయ్యారు. అయితే వెళ్లేందుకు ఆర్థిక స్తోమత లేక ఇంటిలో ఉండిపోయాడు. స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ ఆ క్రీడా కారుడికి ఆర్థిక సహాయం అందించారు. దీంతో సంతోష్ ఆగ్రా కు వెళ్లి లాక్రోస్ క్రీడ‌ల్లో రాణించి రన్నర్ గా నిలిచారు. దీంతో ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ తరుపున హర్షం వ్యక్తం చేశారు. చదువుకు, క్రీడాలకు పేదరికం అడ్డు కాకూడదు అని అన్నారు. అందుకోసం నిరుపేద కుటుంబాలకు సాయం చేస్తున్నాన‌ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *