సిరా న్యూస్,గుంటూరు;
ఏపీలో భూసరిహద్దు పేరుతో సర్వే రాళ్ల కొనుగోళ్లలోనూ అక్రమాలు జరిగాయంటూ..ఏసీబీ విచారణకు ఆదేశించింది. గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి పాత్ర ఉందన్న ఫిర్యాదులు రావడంతో ఆయనపై కేసు నమోదు చేసింది ఏసీబీ.రాళ్ల కొనుగోలుకు రెవెన్యూ, సర్వే శాఖల నుంచి నిధుల విడుదలపై క్లారిటీ రాకముందే APMDC నుంచి రూ.470 కోట్ల చెల్లింపులు జరిగాయన్న అలిగేషన్స్ ఉన్నాయి. ప్రభుత్వ అనుమతి, ఆమోదం లేకుండానే నిర్ణయం తీసుకోవడంతో పాటు.. రాళ్ల కొనుగోళ్లలో భారీగా ముడుపులు పొందారన్న ఆరోపణలు ఉన్నాయిఈ నేపథ్యంలో ఏసీబీ ఉన్నతాధికారి ఆధ్వర్యంలోని టీమ్ లేటెస్ట్‌గా APMDC ఎండీ, గనుల శాఖ డైరెక్టర్ ఆఫీస్‌లకు వెళ్లింది. భూసర్వే కోసం కొన్న సర్వే రాళ్లకు సంబంధించి నడిపిన ఫైళ్లు, చెల్లింపులు, సర్వేశాఖ ఇచ్చిన ఇండెంట్, ఏయే ఏజెన్సీల నుంచి ఎంత రాయి కొన్నారో వివరాలు కావాలని కోరింది. సర్వే రాళ్ల కొనుగోలుపై 15 అంశాల్లో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కోరినట్లు తెలుస్తోంది.సరిహద్దు రాళ్ల కోసం రెండు ప్రైవేటు సంస్థల ద్వారా గ్రానైట్ రాళ్లు కొన్నారు. ఇందులో ఓ జూనియర్ అధికారి తన బావమరిదితో కంపెనీ పెట్టించి, ఆ సంస్థకే రాయి సప్లై టెండర్ దక్కేలా చక్రం తిప్పారన్న చర్చ జరుగుతోంది. ఇదంతా వెంకట్‌రెడ్డికి తెలిసే జరిగిందన్న ఫిర్యాదులున్నాయి. ఫస్ట్ విడత కొనుగోళ్ల విలువ రూ.170 కోట్లు. ఒక్కో గ్రానైట్ రాయిని రూ.450కి కొన్నారు. ఇందులో అధికారులకు ఒక్కో రాయిపై రూ.200 కమీషన్‌గా అందినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.ఆ తర్వాత రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా తేలికైన రాళ్లను తెప్పించారు. ఇందులోనూ అవినీతి జరిగిందన్న ఫిర్యాదులు వచ్చాయి. మూడో విడతగా ఒకేసారి 77 లక్షల రాళ్లను కొని జిల్లాలకు పంపించారు. ఈ బిల్లులను సర్వే శాఖ..లేదంటే రెవెన్యూ శాఖ చెల్లించాలి. కానీ APMDC నిధుల నుంచి రూ.450 కోట్లు చెల్లించారు. మరో 60 లక్షల రాళ్లు కొని..పాలిషింగ్ చేయించడం కోసం రూ.600 కోట్లతో ఎంగ్రేవింగ్ యూనిట్లు పెట్టాలని కూడా ప్రపోజల్స్ పెట్టారు. ఇలా ఇద్దరు జూనియర్ అధికారులతో కలిసి వెంకట్‌రెడ్డి స్కామ్ చేశారని ప్రభుత్వానికి లిఖితపూర్వక ఫిర్యాదులు వచ్చాయి. ఈ అంశాలపై కూడా విచారణ జరపాలని ప్రభుత్వం ఏసీబీని ఆదేశించింది. ఫైళ్ల పరిశీలన తర్వాత వెంకట్‌రెడ్డిపై, మరో ఇద్దరు అధికారులపై మరో కేసు నమోదు చేయనున్నట్లు సమాచారంస్యాండ్ నుంచి ల్యాండ్ వరకు.. మైనింగ్ నుంచి లిక్కర్ వరకు..కేసు ఏదైనా.. తెరవెనక ఎవరున్నా..అందరి లెక్కలు తీసే పనిలో ఉంది ఏపీ సర్కార్. ఇప్పటికే ఏపీ పోలీసుల దర్యాప్తులో ఉన్న మూడు ప్రధానమైన కేసులను సీఐడీకి అప్పగించింది ప్రభుత్వం. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్, ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనలతో పాటు..సంచలనం సృష్టించిన సినీనటి జెత్వానీ కేసునూ సీఐడీకి దర్యాప్తు చేస్తోంది.ఈ మూడు కేసుల్లో వైసీపీ నేతలు, గత సర్కార్ హయాంలో కీలకంగా పనిచేసిన అధికారులు విచారణను ఫేస్ చేస్తున్నారు. ఇక ఇసుక స్కామ్ మీద ఇప్పటికే వెంకట్‌రెడ్డి ఏసీబీ కేసులో జైలుకు వెళ్లారు. ఇప్పుడు సరిహద్దు రాళ్ల వివాదం హాట్ టాపిక్ అయింది. నెక్స్ట్ ఏ కేసులో ఎవరి పేరు తెరమీదకు వస్తుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది.