సిరాన్యూస్, చిగురుమామిడి
కార్యకర్త కుటుంబానికి రూ.2లక్షల చెక్కు అందజేసిన మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
* కార్యకర్తలకు అండగా ఉంటాం
బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అన్నారు. చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మేడుదుల కొమురుమల్లు ప్రమాదవశాత్తూ మరణించారు. అయితే పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా ద్వారా మంజూరైన 2 లక్షల రూపాయల చెక్కును నామినీ గా వారి కుటుంబ సభ్యులు కుమారుడు కొమురయ్య, భార్య కొమురవ్వకి చెక్కును అందజేశారు.అధైర్య పడవద్దు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య,జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు కత్తుల రమేష్ యాదవ్, ఎంపీటీసి మిట్టపల్లి మల్లేశం, ముది మాణిక్యం మాజీ సర్పంచ్ జక్కుల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.