సిరాన్యూస్, ఓదెల
సత్యనారాయణకు ఆర్థిక సాయం అందజేసిన కళాకారులు
ఓదెలకు చెందిన సీనియర్ కళాకారులు చిప్పకుర్తి సత్యనారాయణ ( సత్యకళ ఆర్ట్స్ కమాన్ పూర్) కుమారుడు చిప్పకుర్తి రాజశేఖర్ కొద్ది రోజుల క్రితం మృతి చెందారు. వారికి ఆర్థిక సాయం నిమిత్తం పెద్దపల్లి జిల్లా తోటి కళాకారులు జమ చేసినటువంటి రూ. 6850లు బుధవారం తోటి కళాకారుల సమక్షంలో సత్యకళ సత్యనారాయణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి జిల్లా ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొత్తూరి మోహన్ , మోహన్ ఆర్ట్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాదే రాజలింగు ఇందు ఆర్ట్స్ , రాకం వేణు తదితరులు పాల్గొన్నారు .