సిరాన్యూస్, ఆదిలాబాద్
నిందితులను బహిరంగంగా ఉరి తీయాలి : రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థపకులు సత్యరాజ్ ఉపారపు
* లింగాపూర్‌లో కొవ్వొత్తుల ర్యాలీతో యువకుల నిరసన
పచ్చిమ బెంగాల్ కోల్ కతా లో మెడికల్ విద్యార్థి పై లైంగిక దాడికి పాల్పడి, హత్య చేసిన నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు సత్యరాజ్ ఉపారపు అన్నారు.ఈ సందర్బంగా ఘటనను ఖండిస్తూ ఆదిలాబాద్ జిల్లా లింగాపూర్ గ్రామంలో గ్రామ యువకులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా ఉపారపు సత్యరాజ్ మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా నిందితుల్ని వెంటనే ఉరి తీయాలనీ అన్నారు.అనంతరం మృతురాలు మౌమిత పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు శ్రీ రంగ్,యువకులు సుభాష్ గణేష్, రాహుల్, శివరాజ్,రుపెష్,బాలు, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.