Satyaraj Uparapu: పరీక్ష తప్పినంత మాత్రాన జీవితం కోల్పోయినట్టు కాదు

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
పరీక్ష తప్పినంత మాత్రాన జీవితం కోల్పోయినట్టు కాదు
* ఇంపాక్ట్ మోటివేషనల్ స్పీకర్ సత్యరాజ్ ఉపారపు

ఇటీవల ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులందరికీ ప్రముఖ సామజిక సేవకులు ఇంపాక్ట్ మోటివేషనల్ స్పీకర్ శ్రీ సత్యరాజ్ ఉపారపు శుభాకాంక్షలు తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులెవరు అధైర్య పడవద్దని, నిరాశకు లోనై క్షణికావేశంలో ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన పేర్కొన్నారు. పరీక్ష తప్పినంత మాత్రాన జీవితం కోల్పోయినట్టు కాదని కొత్త అవకాశాలను సృష్టించుకుని పట్టుదలతో ముందుకు సాగాలని ,తల్లిదండ్రులు వారి వారి పిల్లలకు మనోధైర్యాన్ని ఇవ్వాలని సూచించారు. దేశ భవిష్యత్తు నిర్మాణంలో విద్యార్థులు యువతదే కీలకపాత్ర అని, చిన్న చిన్న కారణాలతో వారు జీవితాన్ని చాలించి తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలించడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన జీవితంలో విజయం సాధించిన వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *