సిరాన్యూస్,జైనథ్
శాస్త్రీయ దృక్పథంతో ఆలోచన ఉండాలి
* ప్రధానోపాధ్యాయులు సత్యవాన్ చిక్టే
* ఘనంగా సైన్స్ దినోత్సవం
శాస్త్రీయ దృక్పథంతో ఆలోచన ఉండాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యవాన్ చిక్టే అన్నారు.బుధవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం మేడిగూడ రోడ్ పాఠశాలలో సైన్స్ దినోత్సవాన్నిఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి రకరకాల సైన్స్ చిత్రాలను రంగు రంగుల ముగ్గులతో వేసి అందరికి అవగాహన కల్పిస్తూ వివరించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యవాన్ చిక్టే మాట్లాడుతూ నిత్య జీవితంలో సైన్స్ ప్రముఖ పాత్ర వహిస్తుందని అన్నారు. శాస్త్రీయ కోణం ఆలోచనలు ఉండాలి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొనిగెల నారాయణ, ఉపాధ్యాయురాళ్ళు జ్యోతి ,వసుధ ,మంజుష ఉపాధ్యాయులు నాందేవ్, కృష్ణమూర్తి, భావాని ఆనంద్ ,సావయి ప్రకాష్, పెంటపర్తి ఊశన్న, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.