సిరా న్యూస్, సొనాల:
వివేకానంద్ స్కూల్‌లో పక్షి దినోత్సవం..
ఆదిలాబాద్ జిల్లా సొనాల మండల కేంద్రంలోని వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో పక్షి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఈ మేరకు పాఠశాలలో విద్యార్థులకు పక్షుల ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ… పక్షులను కాపాడుకోవల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. కాలుష్యం వలన అనేక పక్షి జాతులు ఇప్పటికే అంతరించిపోయాయని అన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా పక్షుల రక్షణ కోసం ఇంటి వద్ద అట్ట, ప్లాస్టిక్ డబ్బాలతో పక్షులకు గూళ్లు సిద్ధం చేయాలన్నారు. పక్షులకు తాగే వీలుండే విధంగా నీటి తొట్టెలను ఏర్పాటు చేయాలన్నారు. దీంతో పాటు మొక్కలు నాటాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గీసిన వివిద పక్షుల చిత్రపటాలను పరిశీలించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసారు.