సిరాన్యూస్, ఇచ్చోడ
ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి
* డీఆర్డీవో సాయన్న
* ఉపాధి హామీ పనులను పరిశీలన
గ్రామాల్లో చేపడుతున్న ఉపాధి హామీ పనులు కూలీలు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీవో సాయన్న సూచించారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని బోరిగామ గ్రామంలో చేపడుతున్న ఉపాధి హామీ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. పని ప్రదేశంలో కల్పిస్తున్న మౌళిక వసతులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన కూలీలతో మాట్లాడారు. రోజుకు కూలి ఎంత వరకు వస్తుందని అడగగా వారు 270 రూపాయలు వస్తుందని చెప్పారు. కొలతల ప్రకారం ఉపాధి హామీ పనులను చేయాలని ఉపాధి హామీ కూలీలకు తెలిపారు. ఎండలు పెరిగిపోవడంతో ఉదయం సమయంలోనే పనులు పూర్తి చేసుకొని ఇంటికి చేరుకోవాలని సూచించారు. పని ప్రదేశాల్లో తాగునీరు తప్పకుండా తీసుకెళ్లాలని తెలిపారు. ఆయన వెంట ఎంపీడీవో లక్ష్మణ్, సాంకేతిక సహాయకురాలు సునీత, క్షేత్ర సహాయకుడు సుధాకర్ రెడ్డి ఉన్నారు.