సిరాన్యూస్,ఖానాపూర్
రైతు రుణమాఫీ చరిత్రాత్మక నిర్ణయం : కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు బాణావత్ గోవింద నాయక్
రైతు రుణమాఫీ చరిత్రాత్మక నిర్ణయమని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు బాణావత్ గోవింద నాయక్ అన్నారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో సోమవారం విలేకరుల సమావేశంలో బాణావతి గోవింద నాయక్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణాలు మాఫీ చేస్తోందన్నారు. రైతులపై చిత్తశుద్ధి కలిగి ఉన్న పార్టీ, ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ అని నిరూపించిందన్నారు.