సిరాన్యూస్, సొనాల
ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సమావేశం
ఆదిలాబాద్ జిల్లా సోనాల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి విద్యార్థులకు శుక్రవారం ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ మాట్లాడారు. విద్యార్థులు పై చదువులను తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన పలు సంస్కృత కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి.